Sunday, February 22, 2009

రఘుపతి వెంకయ్య నాయుడు (దిది.నెనె.సంసం - 15 march 1941 )




తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి సోదరుడు.
నాయుడుగారి స్వస్థానం మచిలీపట్నం .1886లో తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవాడు.
1912లో మద్రాసు లో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు. తన కుమారుడు ఆర్.ఎస్. ప్రకాష్ ను సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ జర్మనీ, ఇటలీ , అమెరికా దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు 'సిసిల్ బి డెమిల్లి' (Ceicil B.Demille) 'టెన్ కమాండ్‌మెంట్స్'(Ten Commandments) చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.

ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో "భీష్మప్రతిజ్ఞ" మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు "మత్స్యావతార్", "నందనార్", "గజేంద్రమోక్షం" వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై. వీ. రావు లు ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, "విశ్వామిత్ర", "మాయామధుసూదన" , "పాండవ నిర్వహణ", "రాజ్ ఆఫ్ రాజస్థాన్" వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు.
1941 లో తన 69వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.
తెలుగు చలనచిత్ర పితామహుడు అయిన రఘుపతి వెంకయ్య పేరుమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ను స్థాపించింది.
వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు. ప్రకాష్ కాకినాడ దగ్గర "భక్త మార్కండేయ" సినిమా తీశారు. అందులో కాకినాడ రాజారత్నం అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కధానాయిక.


ప్రముఖ నటి దేవిక వెంకయ్య నాయుడు గారి మనవరాలే.





No comments: