Sunday, February 22, 2009

ఎస్.వి. రంగారావు (3 July 1918 – 18 July 1974):

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు అంతగా ఇమడ లేకపొయ్యారు.
కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన "వరూధిని" చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
ఆ తర్వాత "మనదేశం", "పల్లెటూరి పిల్ల", "షావుకారు", "పాతాళభైరవి", "పెళ్ళి చేసి చూడు", "బంగారుపాప", "బాలనాగమ్మ", "గృహలక్ష్మి", "బాల భారతం", "తాతా మనవడు" ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన "చదరంగం" చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు.
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.
బిరుదులు:
విశ్వనటచక్రవర్తి
నటసార్వభౌమ
నటశేఖర
నటసింహ
నటించిన చిత్రాలు
ఆయన నటంచిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని .
1940
వరూధిని(1946)
మన దేశం(1948)
1950
పల్లెటూరి పిల్ల
షావుకారు
తిరుగుబాటు
1951
ఆకాశరాజు
పాతాళభైరవి
1952
దాసి
పెళ్ళిచేసి చూడు
పల్లెటూరు
1953
బ్రతుకు తెరువు
చండీరాణి
దేవదాసు
పరదేశి
పెంపుడు కొడుకు
రోహిణి
1954
అంతా మనవాళ్ళే
జాతకఫలం
అన్నదాత
రాజు-పేద
రాజీ నా ప్రాణం
సంఘం
చంద్రహారం
1955
బంగారుపాప
అనార్కలి
మిస్సమ్మ
జయసింహ
సంతానం
1956
కనకతార
చింతామణి
హరిశ్చంద్ర
చరణదాసి
1957
తోడికోడళ్ళు
సతీ సావిత్రి
మాయాబజార్
అల్లావుద్దీన్ అద్భుతదీపం
సారంగధర
రేపు నీదే
1958
బొమ్మల పెళ్ళి
భూకైలాస్
చెంచులక్ష్మి
పెళ్ళినాటి ప్రమాణాలు
1959
కృష్ణలీలలు
మాంగల్య బలం
అప్పుచేసి పప్పుకూడు
జయభేరి
రేచుక్క పగటిచుక్క
బాలనాగమ్మ
భక్త అంబరీష
సౌభాగ్యవతి
1960
నమ్మిన బంటు
మహాకవి కాళిదాసు
దీపావళి
భట్టి విక్రమార్క
మామకు తగ్గ అల్లుడు
దేవాంతకుడు
1961
వెలుగు నీడలు
కృష్ణ ప్రేమ
సతీసులోచన
ఉషాపరిణయం
కలసి ఉంటే కలదు సుఖం
1962
గాలిమేడలు
టైగర్ రాముడు
పెళ్ళి తాంబూలం
మంచి మనసులు
దక్షయజ్ఞం
గుండమ్మకథ
ఆత్మబంధువు
పదండి ముందుకు
విషబిందువు
1963
నర్తనశాల
తోబుట్టువులు
1964
మురళీకృష్ణ
రాముడు భీముడు
బొబ్బిలి యుద్ధం
1965
నాదీ ఆడజన్మే
పాండవ వనవాసం
తోడు నీడ
సతీ సక్కుబాయి
ఆడబ్రతుకు
1966
మొనగాళ్ళకు మొనగాడు
ఆటబొమ్మలు
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
చిలకా గోరింక
సంగీత లక్ష్మి
భక్త పోతన
అడుగు జాడలు
మోహినీ భస్మాసుర
1967
భక్త ప్రహ్లాద
చదరంగం
గృహలక్ష్మి
లక్ష్మీనివాసం
పుణ్యవతి
రహస్యం
సుఖదుఃఖాలు
వసంతసేన
1968
బాంధవ్యాలు
బందిపోటు దొంగలు
భలే కోడళ్ళు
చిన్నారి పాపలు
కుంకుమ భరిణ
రాము
వీరాంజనేయ
1969
జగత్ కిలాడీలు
మామకుతగ్గ కోడలు
మూగనోము
బందిపోటు భీమన్న
1970
సంబరాల రాంబాబు
జగత్ జెట్టీలు
ఇద్దరు అమ్మాయిలు
దేశమంటే మనుషులోయ్
బస్తీ కిలాడీలు
కిలాడి సింగన్న
1971
విక్రమార్క విజయం
అనురాధ
దెబ్బకు ఠా దొంగల ముఠా
రౌడీ రంగడు
భలేపాప
జాతకరత్న మిడతంభొట్లు
ప్రేమనగర్
శ్రీకృష్ణ సత్య
దసరా బుల్లోడు
శ్రీకృష్ణ విజయం
1972
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
పాపం పసివాడు
పండంటికాపురం
సంపూర్ణ రామాయణం
శాంతి నిలయం
విచిత్రబంధం
వంశోద్ధారకుడు
కత్తుల రత్తయ్య
కొడుకు కోడలు
బాలభారతం
1973
బంగారు బాబు
మరపురాని మనిషి
తాతా మనవడు
డబ్బుకు లోకం దాసోహం
రామరాజ్యం
రాముడే దేముడు
వారసురాలు
మైనరు బాబు
దేవుడు చేసిన మనుషులు
డాక్టర్ బాబు
1974
ప్రేమలూ పెళ్ళిళ్ళు
బంగారు కలలు
చక్రవాకం
గాలిపటాలు
అందరూ దొంగలే
యశోదకృష్ణ

No comments: